News December 20, 2024

నరసాపూర్: అధికారులపై కలెక్టర్ ఆగ్రహం 

image

ప.గో జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణం కోసం రూ.18.40 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేవలం 50 షెడ్లు నిర్మాణం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలో 64 షెడ్లు మంజూరు కాగా, తణుకు 57, పాలకొల్లు 53, నరసాపురం 51, యలమంచిలి 50, ఆకివీడు 36, పెనుగొండ 37, పెనుమంట్ర 41, ఆచంట 44, పెంటపాడు 44, ఇరగవరం 44 ఉన్నాయన్నారు.

Similar News

News February 26, 2026

తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

image

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 26, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.