News December 20, 2024
ATP: రైతులను చిప్‌తో మోసం చేసిన వ్యాపారులు

అనంతపురం(D) వజ్రకరూర్ మం. చాబాల గ్రామంలో ఘరానా మోసం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూర్ పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 12, 2026
‘ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి’

ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, పలు సూచనలు జారీ చేశారు. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
అనంతపురం జిల్లా JC బదిలీ

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.


