News December 20, 2024

సిద్దిపేట: ‘కట్నం కోసమే చంపేశారు’

image

జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లిలో ఫోక్ సింగర్ <<14919941>>శ్రుతి ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, కట్నం కోసమే తన కుమార్తెను భర్త దయాకర్‌తో పాటు కుటుంబీకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో వారి పెళ్లి కాగా ఆ రోజు నుంచే అత్తింటివారు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తల్లి శ్యామల తెలిపారు. తిమ్మాపూర్‌లో శ్రుతి అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News February 5, 2025

సంగారెడ్డి: నవ వధువు సూసైడ్

image

అదనపు కట్నం వేధింపులతో <<15357920>>నవ వధువు<<>> సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ సాకేత్ నగర్‌కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్‌లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్‌లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.

News February 5, 2025

శివంపేట హత్య కేసు UPDATE

image

శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్‌లాల్‌ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్‌లాల్‌‌ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News February 5, 2025

ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ

image

వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

error: Content is protected !!