News December 20, 2024

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన తూ.గో జిల్లా దివాన్‌చెరువులో గురువారం జరిగింది. మండపేట మండలం కేశవరానికి చెందిన చుక్కా శ్రీను(38) తన అత్తవారి గ్రామం శ్రీరాంపురానికి బయలుదేరాడు. దివాన్ చెరువు సెంటర్‌లో బైక్‌పై వెళుతున్న విద్యార్థి వెంకటరమణను శ్రీను లిప్ట్ అడిగి ఎక్కాడు. శ్రీరాంపురం సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీను మృతి చెందగా, వెంకటరమణకు గాయాలయ్యాయి.

Similar News

News December 22, 2024

యూ.కొత్తపల్లి: బీరువా మీద పడి చిన్నారి మృతి

image

యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఫుల్ గాస్పల్ చర్చ్‌లో పాస్టర్‌గా ఉన్న రాజబాబు మనుమరాలు జయకేతన అనే రెండేళ్ల చిన్నారి క్రిస్మస్ వేడుకలకు తన తల్లి రత్న ప్రకాశ్‌తో కలిసి తాతయ్య ఇంటికి వచ్చింది. అయితే ఇల్లు శుభ్రపరుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బీరువా చిన్నారిపై పడింది. దీంతో కొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News December 22, 2024

సామర్లకోట: మరో 10 మంది అరెస్ట్ 

image

సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇటీవల జరిగిన ఒక దాడి ఘటనకు సంబంధించి శనివారం మరో 10 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు CI కృష్ణ భగవాన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేట్లపాలెంలో ఇంటి నిర్మాణ విషయమై రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా, తాజాగా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు CI తెలిపారు.

News December 21, 2024

తొండంగి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

తొండంగి మండలం బెండపూడి హైవేపై జరిగిన శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పని ముగించుకొని ఇంటికి బైక్‌పై వస్తుండగా కత్తిపూడి నుంచి వస్తున్న వీరబాబు బైక్ బలంగా ఢీకొన్నాయి. స్థానికులు వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. SI జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.