News December 20, 2024
మార్కాపురం: కులం పేరుతో దూషణ.. కేసు నమోదు
మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కె. శ్రీనివాసులును దూషించిన కేసులో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కార్యాలయం లోపలికి వచ్చి విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి దిగి కులం పేరుతో దూషించినట్లు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మార్కాపురానికి చెందిన గాలి వెంకటరామిరెడ్డి, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం (బుల్లి) అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
Similar News
News December 22, 2024
ప్రకాశం: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం
గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.
News December 21, 2024
చీపురు పట్టిన జాయింట్ కలెక్టర్
మద్దిపాడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పరిశ్రమ శుభ్రత కార్యక్రమాన్ని ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
News December 21, 2024
జీఎస్డీపీ వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేయాలి: ప్రకాశం కలెక్టర్
జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15% జీఎస్డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు.