News December 20, 2024

కరెంటు దొంగిలించిన ఎంపీ.. ₹2 కోట్ల ఫైన్

image

SP నేత, సంభల్ MP జియా ఉర్ బర్ఖ్‌కు UP ప్రభుత్వం ₹2 కోట్ల ఫైన్ విధించింది. ఇంట్లో 2 మీటర్లను ట్యాంపర్ చేసి కరెంటు దొంగిలించారని తెలిపింది. 2KW కనెక్షన్‌పై 16.15KW లోడ్ పడుతోందని పేర్కొంది. ఆర్నెల్లుగా కరెంటు బిల్లు జీరో వస్తున్నట్టు గుర్తించింది. సంభల్‌లో ఆక్రమణలను తొలగిస్తున్న ప్రభుత్వం ఓ వర్గం కరెంటును దొంగిలిస్తోందని గుర్తించి చర్యలు తీసుకుంటోంది. పోలీసుల సాయంతో స్మార్ట్ మీటర్లు పెడుతోంది.

Similar News

News February 21, 2026

పిల్లలకు నెబులైజర్ వాడుతున్నారా?

image

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్‌ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్‌ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్‌ సలహా మేరకే నెబ్యులైజర్‌ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్‌ వాడచ్చు.

News February 21, 2026

నెటిజన్‌ దారుణ కామెంట్.. గట్టిగా బదులిచ్చిన చిన్మయి!

image

తనపై దారుణ కామెంట్ చేసిన నెటిజన్‌కు సింగర్ చిన్మయి గట్టిగా బదులిచ్చారు. దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు చేసేవాళ్లు లక్షల్లో ఉన్నారని ఆమె ట్వీట్ చేయగా ‘నిన్ను మీ నాన్న రేప్ చేసుంటాడు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘నా తండ్రి నన్ను రేప్ చేయలేదు. కానీ కూతుళ్లను తండ్రులు రేప్ చేస్తారని మీరు ఊహించుకుంటారు. ఇలా మాట్లాడుతున్నారంటే మీరేంటో, మిమ్మల్ని ఎవరు పెంచారో అర్థమవుతోంది’ అని చిన్మయి కౌంటరిచ్చారు.

News February 21, 2026

ఒక్క పెన్షన్ తొలగించలేదు: మంత్రి

image

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరికీ ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. గత 20 నెలల్లో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లినవారి పెన్షన్లు మాత్రమే రద్దు చేశామని వెల్లడించారు. పెన్షన్లు, రుణాలపై జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారని కొండపల్లి మండిపడ్డారు.