News December 20, 2024

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

Similar News

News December 21, 2024

ఆ జాబితాలో అత్య‌ధికులు గుజ‌రాతీలే

image

<<14937075>>అమెరికా పౌర‌సత్వం<<>> పొందుతున్న వారిలో అత్య‌ధికులు గుజ‌రాతీలు ఉన్న‌ట్టు US Immigration అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భారతీయలు, ముఖ్యంగా గుజ‌రాతీలు అమెరికాకు శ‌ర‌ణార్థిగా వెళ్తున్నారు. జాతి, మ‌తం, రాజ‌కీయ సిద్ధాంతాల వ‌ల్ల స్వ‌దేశంలో హింస ఎదుర్కొంటున్న శ‌ర‌ణార్థులుగా అమెరికాలో ఆశ్ర‌యం పొందుతున్నారు. అనంత‌రం ప‌త్రాలు లేక‌పోయినా ప‌నిలో చేరి పౌర‌స‌త్వం పొందుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

News December 21, 2024

శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..

image

శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. చలికాలంలో బాదం, కాజు, వాల్‌నట్స్, ఖర్జూరాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెయ్యి, తేనె శరీరంలో వేడి పుట్టిస్తాయి. జొన్నలు, రాగులు తీసుకోవడం మంచిది. బెల్లం నువ్వుల లడ్డూ, పసుపు, గుడ్లు, చికెన్ తీసుకుంటే త్వరగా జీర్ణం కాక శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది.

News December 20, 2024

పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!

image

పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువుల‌పై దాడులు అధికంగా జ‌రిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువుల‌పై 112 దాడి ఘ‌ట‌న‌లు జ‌రగ్గా, బంగ్లాలో 2,200 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్ర‌భుత్వం కూలిన త‌రువాత దాడులు పెరిగిన‌ట్టు వెల్ల‌డించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.