News December 20, 2024
మహేశ్‌బాబు ‘ముఫాసా’ విడుదల
‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో రిలీజైంది. ముఫాసాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ అందించడంతో థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. స్క్రీన్‌పై బాబు కనిపించకపోయినా సింహంలో ఆయన్ను చూసుకుంటూ వాయిస్ ఎంజాయ్ చేస్తున్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ అందించిన డబ్బింగ్ నవ్వు తెప్పించిందని అంటున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ!
Similar News
News December 21, 2024
ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా?
ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 లీగ్ స్టేజీలో భాగంగా తమ చివరి మ్యాచులో పుణెరి పల్టాన్‌పై తెలుగు టైటాన్స్ 48-36 తేడాతో గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా, ఆరో స్థానం కోసం U ముంబా, టైటాన్స్ మధ్య పోటీ ఉంది. U ముంబాకు ఇంకా 2 లీగ్ మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో ఆ జట్టు భారీ తేడాతో ఓడితేనే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.
News December 21, 2024
చంద్రబాబు గారు విద్యార్థులకు ట్యాబ్‌లు ఎక్కడ?: జగన్
AP: తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఏమయ్యాయని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘ప్రతి ఏటా రూ.15వేల అమ్మ ఒడి ఏది? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఎక్కడ? విద్యా దీవెన, వసతి దీవెన, 3వ తరగతి నుంచి టోఫెల్, నాడు-నేడు పనులు ఎక్కడ? ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ? తల్లికి వందనం హామీ ఏమైంది? అమ్మ ఒడిని ఈ ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు?’ అని ట్వీట్ చేశారు.
News December 21, 2024
TODAY HEADLINES
* KTRను 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దు: హైకోర్టు
* కబ్జాలు చేసే వారి తాట తీస్తాం: చంద్రబాబు
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
* ధరణితో రైతుల సమాచారం విదేశాలకు వెళ్లింది: సీఎం రేవంత్
* భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
* ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్
* బీఆర్ఎస్ పాలనంతా కచరా గవర్నెన్స్: అక్బరుద్దీన్
* కరెంటు దొంగిలించిన సంభల్ MP జియా ఉర్ బర్ఖ్‌కు ₹2 కోట్ల ఫైన్