News December 20, 2024
Stock Market: మరోసారి భారీ నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. వీక్ సెంటిమెంట్, రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమవ్వడం, విదేశీ ఇన్వెస్టర్ల ఔట్‌ఫ్లోతో బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద, నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంకు, మెటల్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.
Similar News
News September 19, 2025
భారత్‌ను ఓడించిన కివీసే మా స్ఫూర్తి: WI కోచ్

భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్‌తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. IND, WI మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.
News September 19, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.
News September 19, 2025
వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్‌పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.