News December 20, 2024
రూ.299కే రూ.10,00,000 బీమా

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ కింద తక్కువ ప్రీమియంలకే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. రూ.299తో పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం ఏర్పడినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 18-65 ఏళ్ల లోపు వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఆత్మహత్య, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ మరణాలకు ఈ ఇన్సూరెన్స్ లభించదు. వివరాలకు <
Similar News
News January 17, 2026
5 రోజుల్లో రూ.226కోట్లు కలెక్ట్ చేసిన MSVG

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రిలీజైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.226 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని వెల్లడించారు. కాగా ఇవాళ, రేపు ఇదే ఊపు కొనసాగే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News January 17, 2026
రాత్రికి రాత్రి అనుమతి లేదంటున్నారు: తలసాని

TG: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం ర్యాలీ చేస్తామని తాము ఎప్పుడో దరఖాస్తు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘నిన్న ఓకే చెప్పి రాత్రికి రాత్రే అనుమతి లేదని పోలీసులు చెప్పారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇష్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారు. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని ర్యాలీ చేస్తాం’ అని ఆయన చెప్పారు.
News January 17, 2026
అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు రాజ్ ఠాక్రే పిలుపు

ముంబై మున్సిపల్ ఎన్నికల <<18877157>>ఫలితాల<<>> నేపథ్యంలో MNS అధినేత రాజ్ ఠాక్రే తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మనం అపారమైన డబ్బు, అధికార బలంతో తలపడ్డాం. ఆశించిన ఫలితం రాకపోయినా అధైర్యపడొద్దు’ అని భరోసానిచ్చారు. మరాఠీ భాష, అస్తిత్వం కోసం పోరాడటమే మన ఊపిరి అని, గెలిచిన వారు ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ అధికారంలోకి వద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.


