News December 20, 2024
వారి DNAలోనే దళితులపై వ్యతిరేకత: మంత్రి కొండా సురేఖ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733501468011_893-normal-WIFI.webp)
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల DNAలోనే దళితులపై వ్యతిరేకత ఇమిడి ఉందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని, తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా దళిత నేత, స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ సభ్యులు దాడికి యత్నించడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఆమె ఖండించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
Similar News
News February 5, 2025
పేరు మార్పు: ఫోర్ట్ విలియమ్ ఇకపై ‘విజయ్ దుర్గ్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747998209_1199-normal-WIFI.webp)
కోల్‌కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్‌దుర్గ్‌నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.
News February 5, 2025
23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738751048563_367-normal-WIFI.webp)
AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
News February 5, 2025
Stock Markets: మీడియా, మెటల్, PSU బ్యాంకు షేర్లు అదుర్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734614493514_1199-normal-WIFI.webp)
దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. నిఫ్టీ 23,696 (-42), సెన్సెక్స్ 78,271 (-312) వద్ద క్లోజయ్యాయి. FMCG, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లు ఎగిశాయి. హిందాల్కో, ITC హోటల్స్, ONGC, అపోలో హాస్పిటల్స్, BPCL టాప్ గెయినర్స్.