News December 20, 2024
గూగుల్‌లో మళ్లీ లేఆఫ్స్
గూగుల్ ఉద్యోగుల మెడపై మరోసారి లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారినీ తొలగిస్తామని చెప్పారు. వీరిలో కొందరిని వేరే బాధ్యతల్లోకి, మరికొందరిని పూర్తిగా తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి పోటీ నెలకొనడంతో గూగుల్‌తోపాటు మరికొన్ని కంపెనీలు లే ఆఫ్స్ బాటపడుతున్నాయి.
Similar News
News December 21, 2024
నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. HYD, VZMతో పాటు మొత్తం 7 నగరాల్లో ఈ మ్యాచులు జరగనుండగా, 38 జట్లు పోటీ పడనున్నాయి. జనవరి 5తో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగియనుండగా, JAN 9 నుంచి నాకౌట్ మ్యాచులు నిర్వహిస్తారు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, రుతురాజ్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్, అభిషేక్ శర్మ తదితరులు పాల్గొంటారు. ఆంధ్ర కెప్టెన్‌గా KS భరత్, HYD కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు.
News December 21, 2024
అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
News December 21, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్
ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్థుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్‌లో ప్రియాంకకు 6.22లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి.