News December 20, 2024
ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్
APలో డీప్-టెక్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన భాగస్వామి అమెజాన్ వెబ్‌తో కలిసి AI-ఫోకస్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్‌తో మరో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
Similar News
News December 21, 2024
ఈనెల 25న మెదక్ పర్యటనకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 25న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్నారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
News December 21, 2024
నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. HYD, VZMతో పాటు మొత్తం 7 నగరాల్లో ఈ మ్యాచులు జరగనుండగా, 38 జట్లు పోటీ పడనున్నాయి. జనవరి 5తో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగియనుండగా, JAN 9 నుంచి నాకౌట్ మ్యాచులు నిర్వహిస్తారు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, రుతురాజ్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్, అభిషేక్ శర్మ తదితరులు పాల్గొంటారు. ఆంధ్ర కెప్టెన్‌గా KS భరత్, HYD కెప్టెన్‌గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు.
News December 21, 2024
అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.