News December 20, 2024
రామ్‌చరణ్‌కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ నిర్మిస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరిస్తారు. కాగా ఇప్పటివరకు హీరో ప్రభాస్‌కు కట్టిన 230 అడుగుల కటౌటే దేశంలో అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Similar News
News December 21, 2024
ఇక నుంచి రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్నెస్ కాలర్ ట్యూన్లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్‌ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.
News December 21, 2024
ఈడీ కేసుపైనా హైకోర్టుకు కేటీఆర్?
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్‌కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై <<14936688>>ఈడీ కేసు<<>> ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయాలా? పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరవ్వాలా అనే దానిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
News December 21, 2024
ఏపీ హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే?
ఏపీ హైకోర్టులో 2,47,097 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో వెల్లడించారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టులో 82,640, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో కలిపి మొత్తం 61,80,878 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పారు.