News December 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆}పాల్వంచ:కోతుల దాడిలో మహిళ మృతి∆} ఖమ్మం:2,3నెలల్లో సర్వేయర్ల నియామకం: పొంగులేటి∆}ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ పై కేసు: మాజీ ఎమ్మెల్యే∆}కారేపల్లి:రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి∆} ఎర్రుపాలెం:రైతు పంట పొలం వద్ద క్షుద్ర పూజలు∆}ఎన్నికల వరకే రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే కందాల∆}ఖమ్మం పోలీస్ కమీషనరేట్ ఏవోగా చంద్రకళ∆}భద్రాచలం:పేకాట స్థావరాలపైపోలీసుల దాడులు∆}BRSనేతలు ప్రజల గొంతు నొక్కారు:కూనంనేని
Similar News
News January 22, 2026
ఖమ్మంలో జేఈఈ మెయిన్స్ షురూ.. తొలిరోజు 98 శాతం హాజరు!

ఖమ్మం జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 1,748 మంది అభ్యర్థులకు గాను 1,721 మంది (98.4%) హాజరైనట్లు కో-ఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంట ముందుగానే తనిఖీలు పూర్తి చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.
News January 22, 2026
ఖమ్మం: ‘మాకు స్తోమత లేదు.. అక్కడే పూడ్చండి’

పొట్టకూటి కోసం వేలాది మైళ్ల దూరం నుంచి వచ్చిన ఆ వలస కూలీకి చివరకు సొంతూరి మట్టి కూడా కరవైంది. బిహార్‌కు చెందిన రాజన్‌రామ్ పందిళ్లపల్లి సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అంత దూరం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. దీంతోఅన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
News January 22, 2026
రైతులకు ఊరట.. జిల్లాకు భారీగా యూరియా

సాగువేళ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుధవారం చింతకాని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు 505.35మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ నిల్వలను పూర్తిగా ఖమ్మం జిల్లాకే కేటాయించినట్లు ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.


