News December 20, 2024

పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!

image

పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువుల‌పై దాడులు అధికంగా జ‌రిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువుల‌పై 112 దాడి ఘ‌ట‌న‌లు జ‌రగ్గా, బంగ్లాలో 2,200 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్ర‌భుత్వం కూలిన త‌రువాత దాడులు పెరిగిన‌ట్టు వెల్ల‌డించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.

Similar News

News December 21, 2024

HIGH ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.

News December 21, 2024

నేడు GST కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు?

image

FM నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై GST రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై GST రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్/డీజిల్‌తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై GSTని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై GSTని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.

News December 21, 2024

ఇక నుంచి రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్

image

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్‌నెస్ కాలర్ ట్యూన్‌లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్‌ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.