News December 21, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్

ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్థుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్‌లో ప్రియాంకకు 6.22లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి.
Similar News
News November 8, 2025
హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకునే విధానాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందుతారు. ప్రతి సమస్య నుండి తమ బిడ్డను రక్షించడానికి సాయం చేయాలనుకుంటారు. అయితే వారి మితిమీరిన జోక్యం భవిష్యత్తులో పిల్లలకి సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు. పిల్లలను ఎదగనివ్వాలని, వారిని సొంతంగా నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు.
News November 8, 2025
19 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొచ్చిలోని కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్, రెవెన్యూ శాఖ 19 గ్రూప్-C కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/
News November 8, 2025
హనుమాన్ చాలీసా భావం – 3

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||
ఆంజనేయుడు గొప్ప వీరుడు. సాటిలేని పరాక్రమవంతుడు. ఆయన దేహం వజ్రాయుధంలా దృఢమైనది. ఆయన భక్తుల చెడు ఆలోచనలను పూర్తిగా తొలగిస్తాడు. మంచి ఆలోచనలు గలవారి దగ్గరికి వెళ్లి, వారికి స్నేహితుడిగా ఉంటాడు. ఇన్ని సుగుణాలు గల హనుమాన్‌ను నిత్యం ధ్యానించడం వలన మనలో ధైర్యం పెరిగి, దుర్బుద్ధి తొలగి, సద్బుద్ధి పెరుగుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


