News December 21, 2024
ఇక నుంచి రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వీటిపై ఫోన్ యూజర్లకు రోజుకు 8-10 సార్లు అవేర్‌నెస్ కాలర్ ట్యూన్‌లు ప్లే చేయాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. తాము అందించే వివిధ కాలర్ ట్యూన్స్‌ను 3 నెలల పాటు ప్లే చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.
Similar News
News December 21, 2024
సంక్రాంతికల్లా రైతు భరోసా ఇస్తాం: తుమ్మల
TG: సంక్రాంతికల్లా రైతు భరోసా అందివ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ చర్చలో తెలిపారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.80 వేలకోట్లు ఇచ్చింది. సాగుచేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగుభూములకే భరోసా అందించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తాం’ అని పేర్కొన్నారు.
News December 21, 2024
$92,281 నుంచి $97,454కు పెరిగిన బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కొంతమేర పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $92,281 నుంచి $97,454 (Rs83 లక్షలు) స్థాయికి పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.95 శాతంగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.48% పెరిగి $3,471 వద్ద ట్రేడవుతోంది. $3098 కనిష్ఠ స్థాయి నుంచి ఎగిసింది. BNB, USDT, DOGE, ADA, AVAX, LLINK, TON, SUI, SHIB లాభపడ్డాయి. XRP, SOL, USDC, TRX, LINK, XLM నష్టపోయాయి.
News December 21, 2024
వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.