News December 21, 2024
నేడు GST కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు?
FM నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై GST రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై GST రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్/డీజిల్‌తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై GSTని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై GSTని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 21, 2024
BIG BREAKING: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు
AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు స్కూలు నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
News December 21, 2024
చేతకాని దద్దమ్మ: జర్మనీ దేశాధినేతను తిట్టిన మస్క్
జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షూల్జ్‌పై భూలోక కుబేరుడు ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ఆయన్ను ‘చేతకాని దద్దమ్మ’ అనేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైట్ వింగ్ పార్టీ AfD మాత్రమే ఆ దేశాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. మాగ్డెబర్గ్‌లోని క్రిస్మస్ హాలిడే మార్కెట్లో షాపింగ్ చేస్తున్న జనాలపై కారు <<14938865>>దాడిని<<>> ఖండించారు. టెర్రరిస్టు అటాక్‌గా అనుమానిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 68 మంది గాయపడ్డారు.
News December 21, 2024
సంక్రాంతికల్లా రైతు భరోసా ఇస్తాం: తుమ్మల
TG: సంక్రాంతికల్లా రైతు భరోసా అందివ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ చర్చలో తెలిపారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.80 వేలకోట్లు ఇచ్చింది. సాగుచేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగుభూములకే భరోసా అందించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తాం’ అని పేర్కొన్నారు.