News December 21, 2024
HIGH ALERT.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.
Similar News
News December 21, 2024
‘ఉచిత బస్సు‘పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం
AP: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.
News December 21, 2024
కేటీఆర్ ఆ విషయాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా: వెంకట్‌రెడ్డి
24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్న KTR వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘11 నుంచి 13 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు. నేను స్వయంగా గ్రామాల్లో తిరిగి తెలుసుకున్నాను. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని KTR అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.
News December 21, 2024
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు చిరు, పవన్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఈనెల 27న ట్రైలర్ విడుదల కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నారు.