News December 21, 2024
పేరేచర్ల: అర్ధరాత్రి ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల కాలువ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం సంభవించి ఓ యువకుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.
News January 23, 2026
గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.