News December 21, 2024
ఏపీ అభివృద్ధి కి నిధులు ఇవ్వండి: పయ్యావుల

రాజస్తాన్‌లో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ప్రాధాన్యతా రంగాలకు అవసరమైన నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చేనేత క్లస్టర్ల ఏర్పాటు, ఏవియేషన, పెట్రోల్ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలని కోరారు.
Similar News
News January 19, 2026
122 అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 122 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
News January 19, 2026
అనంతపురం: 54 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

అనంతపురం జిల్లా పరిషత్ పరిధిలోని 54 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు. జడ్పీ సీఈఓ శివ శంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
News January 19, 2026
మహిళల భద్రతకు అగ్రపీఠం: జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ పి.జగదీష్ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించాలని సూచించారు. వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.


