News December 21, 2024
VZM: అసభ్య ప్రవర్తన ఆరోపణలతో టీచర్ సస్పెండ్

కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్ సన్యాసిరావుపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని అదే స్కూల్ టీచర్ వాపోయారు. విద్యార్థినులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించి.. వారికి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో సన్యాసిరావును డీఈవో మాణిక్యం నాయుడు సస్పెండ్ చేశారు. ఆ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావును HM బాధ్యతలు తప్పించారు.
Similar News
News December 1, 2025
విజయనగరం: ‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని జిల్లా జడ్జి ఎం.బబిత న్యాయమూర్తులకు సూచించారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటి వాటిని ఇరు పార్టీల అనుమతితో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు.
News December 1, 2025
విజయనగరం: HIV వ్యాధిగ్రస్తులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీతో పాటు స్థానిక ఐఎంఏ హాలులో అవగాహనా సదస్సు నిర్వహించారు. అనంతరం బాధితులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనాలు చేశారు. హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారు కూడా సమాజంలో భాగమేనన్నారు.
News November 30, 2025
VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.


