News December 21, 2024
‘భరణం’ పేరిట భర్తను భార్య దోచుకోకూడదు: సుప్రీం
భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్‌గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.
Similar News
News December 21, 2024
నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు: CM రేవంత్
TG: తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
News December 21, 2024
రండి.. గన్‌మెన్లు లేకుండా వెళ్దాం: రేవంత్
TG: మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే BRS కాళ్లలో కట్టెలు పెడుతోందని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఆ జిల్లా మహిళలు గర్భం దాల్చేందుకూ భయపడుతున్నారు. మూసీ పునరుజ్జీవం వద్దని ప్రజలు చెబుతున్నారని BRS అంటోంది. రండి.. KTR వస్తారో? హరీశ్ వస్తారో? నేను కూడా గన్‌మెన్లు లేకుండా వస్తా. నల్గొండ పోదామా? భువనగిరి పోదామా? ఆలేరు పోదామా? మూసీ పునరుజ్జీవం కావాలో, వద్దో అడుగుదాం?’ అని అన్నారు.
News December 21, 2024
ప్రియురాలి కోసం 200KMS ప్రయాణించిన పులి
వన్యమృగాల్లోనూ ప్రేమ ఉంటుంది. రష్యాలో బోరిస్ అనే ఓ సైబీరియన్ పులి తన ప్రియురాలిని కలుసుకునేందుకు 200KMS (124 మైళ్లు) ప్రయాణించింది. వన్యమృగాల పరిరక్షణలో భాగంగా ఆడ-మగ పులులను అటవీ అధికారులు పెంచారు. కొన్నేళ్ల క్రితం వీటిని చెరో అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో తనతో పెరిగిన ఆడపులి స్వెత్లాయాను కలుసుకునేందుకు బోరిస్ వందల కి.మీలు నడుస్తూ దానిని చేరుకుంది. GPS కాలర్ బెల్ట్ ద్వారా ఇది గుర్తించారు.