News December 21, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు

image

TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 21, 2024

భారత మాజీ క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ

image

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఉతప్ప ఉద్యోగుల జీతాల నుంచి ₹23 లక్షలు కట్ చేసి EPFOలో జమ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈక్రమంలో కర్ణాటక పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షర గోపాల రెడ్డి ఈ వారెంట్ జారీ చేశారు.

News December 21, 2024

అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారు: రేవంత్

image

TG: రైతులకు మేలు చేసేలా BRS సూచనలు చేస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని CM ఎద్దేవా చేశారు.

News December 21, 2024

13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరో శుభవార్త

image

SBI 13,735 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో 609 బ్యాక్‌లాగ్ పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా, JAN 7 వరకు అప్లై చేయవచ్చు. APలో 50, TGలో 342 ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు.