News December 21, 2024
ఉండి: పార్శిల్లో డెడ్‌బాడీ.. సరికొత్త విషయాలు
ఉండి మండలం యండగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో గుర్తు తెలియని డెడ్‌బాడీ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ డెడ్‌బాడీ పార్శిల్ వచ్చినప్పటి నుంచి తులసి చెల్లెలి భర్త కనిపించడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో ఇంత వరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఆ మృతదేహం ఎవరిదో కూడా ఇంకా తెలియకపోవడం సంచలనంగా మారింది.
Similar News
News December 22, 2024
యువత జాతీయ స్థాయిలో రాణించాలి: కలెక్టర్
ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
News December 21, 2024
విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: జడ్పీ చైర్‌పర్సన్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యా ప్రమాణాల స్థాయి పెంచే విధంగా విద్యా శాఖాధికారులు కృషి చేయాలనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వీ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు నియంత్రణకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు.
News December 21, 2024
భీమవరంలో పలు రైస్ మిల్లు తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం భీమవరం మండలం నరసింహపురం వద్ద పలు రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.