News December 21, 2024
బ్యాంకుల్లో NPAలకు UPA అవినీతే కారణం: రఘురామ్ రాజన్
ప్రభుత్వ బ్యాంకుల్లో మొండి బకాయిలు, NPAలు పెరగడానికి UPA హయాంలో అవినీతే కారణమని RBI Ex Gov రఘురామ్ రాజన్ అన్నారు. వాటిని రైటాఫ్ చేసి సమస్యను పరిష్కరించిందని మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. వరుసగా స్కాములు బయటపడటం, గ్లోబల్ క్రైసిస్, ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యం, నిరాకరణతో NPAలు పెరిగాయని కుండబద్దలు కొట్టారు. సిస్టమ్‌ను క్లీన్ చేసేందుకు AQR అవసరమంటే జైట్లీ వెంటనే OK చెప్పేశారని గుర్తుచేసుకున్నారు.
Similar News
News December 21, 2024
వారసత్వ పన్ను అవసరమే: యంగ్ బిలియనీర్
భారత్‌లో వారసత్వ పన్ను అవసరమేనని జెరోదా ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ అంటున్నారు. సమాజానికి పంచకుండా తరతరాలుగా సంపద ఒకేదగ్గర పోగుపడటం సబబు కాదన్నారు. ‘ఒక తరం సంపదను పొందిన ప్రతిసారీ దానిపై కొంత పన్ను చెల్లించడం సరైనదే. భారత్‌లో దీన్ని అమలు చేయడం సవాలే. కానీ ఏదో ఒక మార్గం వెతకాలి. సంపదను తిరిగివ్వడానికి సంపన్నులు మరింత కృషి చేయాలనేదే నా సలహా’ అని అన్నారు. కామత్ Podcastల్లో మాట్లాడటం తెలిసిందే.
News December 21, 2024
భారత మాజీ క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఉతప్ప ఉద్యోగుల జీతాల నుంచి ₹23 లక్షలు కట్ చేసి EPFOలో జమ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈక్రమంలో కర్ణాటక పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షర గోపాల రెడ్డి ఈ వారెంట్ జారీ చేశారు.
News December 21, 2024
అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారు: రేవంత్
TG: రైతులకు మేలు చేసేలా BRS సూచనలు చేస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని CM ఎద్దేవా చేశారు.