News December 21, 2024

మున్సిపాలిటీలుగా కేసముద్రం, ఘన్‌పూర్.. మీ కామెంట్?

image

కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలను మున్సిపాలిటీలు‌గా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసముద్రం పరిధిలో 40 గ్రామ పంచాయతీలు, స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో 18 ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీఓ విడుదల చేయాల్సి ఉంది. మరి ఎన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కలుస్తాయి..? ఎన్ని గ్రామాలు GPలుగానే కొనసాగుతాయి? అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News July 7, 2025

వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

image

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.

News July 6, 2025

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

image

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.

News July 6, 2025

వరంగల్: ఇక్కడి రోటి యమ ఫేమస్..!

image

ఉత్తరాది రుచులు ఇక్కడి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలసదారులు వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట డాబాలను ఏర్పాటు చేసి అక్కడి రోటితో పాటు పలు కర్రీలు చేస్తూ రుచులు చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వంటకాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.