News December 21, 2024

పవన్.. గిరిజనులపట్ల మీ నిబద్ధత అద్భుతం: లక్ష్మీనారాయణ

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల పర్యటనపై జైభారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ‘గిరిజన ప్రాంతాల అభివృద్ధి పట్ల మీ నిబద్ధత అద్భుతం. గిరిజనులకు నిధుల సమీకరణలో ట్రైబల్ సబ్-ప్లాన్, కేంద్ర ప్రత్యేక సాయం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాలు కీలకం. మీ నాయకత్వంలో గిరిజనులకు నిధుల కేటాయింపు జరిగి, సంక్షేమ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 5, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

image

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 5, 2025

భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

image

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్‌కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.

News November 5, 2025

నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

image

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.