News December 21, 2024

NZB: ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

image

NZBలోని కాకతీయ విద్యాసంస్థలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని మృతి చెందిన ఘటన మరవకముందే మరో వివాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ బ్రాంచ్‌లో 8th క్లాస్ విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లి హడావిడిలో ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. దీంతో అతడిని తరగతి గదిలో టీచర్ స్టేజిపైకి ఎక్కించి అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 5, 2025

నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

image

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

News November 5, 2025

రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

image

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 4, 2025

NZB: తాగి వాహనాలు నడిపినందుకు జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. గౌతమ్ నగర్‌కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటగల్లీకి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల చొప్పున, బోధన్‌కు చెందిన సురేందర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 32 మందికి రూ.56,500 జరిమానా విధించినట్లు వివరించారు.