News December 21, 2024
విజయనగరం పోలీసులను అభినందించిన మంత్రి లోకేశ్
విజయనగరం పోలీసులకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు కురిపించారు. బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 22, 2024
VZM: వారిపై ప్రత్యేక నిఘా
గంజాయి అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు VZM పోలీసు యంత్రాంగం తెలిపింది. ఇదివరకే అరెస్ట్ చేసిన వారిపై హిస్టరీ షీట్లను ప్రారంభిస్తామంది. ఏడు మార్గాల్లో 5 చెక్‌పోస్టులతో నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. గంజాయి సేవించే వారిని, రవాణా చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటామని SP వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి, 247 మందిని అరెస్ట్ చేశామన్నారు.
News December 22, 2024
భామిని : ఆటో-కారు ఢీ.. ఐదుగురికి గాయాలు
పాతపట్నం మండలం కొరసవాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారు మన్యం జిల్లా భామిని (M) లివిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాతపట్నం నుంచి నవతల వైపు వస్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం.
News December 22, 2024
VZM: గుండెపోటుతో భవానీ భక్తుడు మృతి
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. భవాని దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో దీక్ష విరమణకు వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అప్పలనాయుడు 15 మంది భవానీలతో కలిసి క్యూలైన్‌లో ఉండగా శనివారం గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.