News December 21, 2024
తణుకు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) బైక్పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
ప.గో జిల్లా ఎస్పీ హెచ్చరిక

సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
News January 12, 2026
ప.గో: నేటి పీజీఆర్ఎస్కు 211 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 211 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.