News December 21, 2024
ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Similar News
News December 22, 2024
GNT: కాకులు వాలని కొండ ఎక్కడ ఉందో తెలుసా.?
కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపైకి కాకులు వచ్చిన దాఖలాలు లేవు. ఇది నరసరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రభలతో భక్తులు దర్శించుకుంటారు.
News December 22, 2024
GNT: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం
గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూతవేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.
News December 22, 2024
జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం
ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.