News December 21, 2024
ప్రియురాలి కోసం 200KMS ప్రయాణించిన పులి
వన్యమృగాల్లోనూ ప్రేమ ఉంటుంది. రష్యాలో బోరిస్ అనే ఓ సైబీరియన్ పులి తన ప్రియురాలిని కలుసుకునేందుకు 200KMS (124 మైళ్లు) ప్రయాణించింది. వన్యమృగాల పరిరక్షణలో భాగంగా ఆడ-మగ పులులను అటవీ అధికారులు పెంచారు. కొన్నేళ్ల క్రితం వీటిని చెరో అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో తనతో పెరిగిన ఆడపులి స్వెత్లాయాను కలుసుకునేందుకు బోరిస్ వందల కి.మీలు నడుస్తూ దానిని చేరుకుంది. GPS కాలర్ బెల్ట్ ద్వారా ఇది గుర్తించారు.
Similar News
News December 22, 2024
ఆ చిన్నారుల సమస్యకు శాశ్వత పరిష్కారం: లోకేశ్
AP: YSR(D) కొర్రపాడులో స్కూల్ దుస్థితిపై WAY2NEWS రాసిన <<14938798>>కథనానికి<<>> మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ప్రస్తుతం రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించాను. పునాదుల్లో నిలిచిపోయిన స్కూలు భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని ట్వీట్ చేశారు.
News December 22, 2024
నేను తలుచుకుంటే ఎవడూ మిగలడు: అచ్చెన్నాయుడు
AP: వైసీపీ హయాంలో తనను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అయితే తానేమీ కక్ష సాధింపులకు దిగడం లేదని, తన కోపం నరం తెగిపోయిందని చెప్పారు. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను తలుచుకుంటే ఒక్కడూ మిగలడని వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో జగన్ అన్ని వర్గాలనూ మోసం చేశారని విమర్శించారు. ఏకంగా రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
News December 22, 2024
స్కిల్స్ వర్సిటీలో మరో నాలుగు కోర్సులు
TG: యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మరో 4 కోర్సులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సప్లై చైన్ ఎసెన్షియల్ సర్టిఫికేషన్, ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్- ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా టెక్నీషియన్, లెన్స్‌కార్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సులు ఉంటాయి. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగులు <