News December 21, 2024
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్
బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.
Similar News
News December 21, 2024
MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 21, 2024
కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ పట్టణం ఇక అప్‌గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.
News December 21, 2024
MBNR: వ్యవస్థీకృత నేరాలపై దృష్టిపెట్టాలి: ఎస్పీ జానకి
పోలీస్ అధికారులు వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టాలని, నమోదైన ప్రతి కేసులో లోతైన విచారణ పారదర్శకంగా చేపట్టాలని MBNR జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. సాక్షులను బ్రీఫ్ చేస్తూ మహిళలపై జరుగుతున్న నేరాలు, ఫోక్సో కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు.