News December 21, 2024

జనవరి 2న క్యాబినెట్ భేటీ

image

AP: జనవరి 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు విషయాలపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం.

Similar News

News December 22, 2024

సీఎం నిర్ణయం.. ఆ సినిమాలపై ఎఫెక్ట్

image

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చేది లేదని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం ప్రభావం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై పడనుంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడని నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు షాక్ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

News December 22, 2024

గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు

image

జ‌ర్మ‌నీలో క్రిస్మ‌స్ మార్కెట్‌‌లో జనాలపైకి కారు దూసుకొచ్చిన‌ ఘ‌ట‌న‌లో ఏడుగురు భార‌తీయులు కూడా గాయపడ్డారు. మాగ్డెబ‌ర్గ్ న‌గ‌రంలోని ర‌ద్దీ ప్రాంతంలో 50 ఏళ్ల తాలెబ్ కారులో వేగంగా వ‌చ్చి ప్ర‌జ‌ల్ని ఢీకొంటూ వెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో 200 మంది గాయప‌డ్డారు. వీరిలో 41 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News December 22, 2024

HYDలో భారీగా త‌గ్గ‌నున్న ఇళ్ల అమ్మ‌కాలు

image

HYDలో Oct-Dec క్వార్ట‌ర్‌లో ఇళ్ల అమ్మ‌కాలు 47% త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని PropEquity అంచ‌నా వేసింది. గ‌త ఏడాది Q3తో పోలిస్తే అమ్మ‌కాలు 24,004 నుంచి 12,682 యూనిట్ల‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మ‌హా న‌గ‌రాల్లో అమ్మ‌కాలు 21% త‌గ్గొచ్చని సంస్థ వెల్ల‌డించింది. బెంగ‌ళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మ‌కాల్లో క్షీణ‌తకు కారణంగా తెలుస్తోంది.