News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి
AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.
Similar News
News December 22, 2024
టోల్ వసూలు చేస్తూనే ఉంటామంటే కుదరదు: సుప్రీం
ఇష్టమొచ్చినంత కాలం టోల్ వసూలు చేసుకోవడం నిరంకుశత్వమేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘టోల్ వసూలు శాశ్వతం కాదు. ప్రాజెక్టులనేవి ప్రజల కోసమే తప్ప ప్రైవేటు సంస్థల లాభార్జన కోసం కాదు. ప్రజలపై అన్యాయంగా భారం మోపడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. ఢిల్లీ-నోయిడా ఫ్లైవే టోల్ రుసుము ఒప్పందాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని నిర్మాణ సంస్థ సుప్రీంలో సవాలు చేయగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
News December 22, 2024
రేవంత్ రెడ్డి Vs అల్లు అర్జున్
ఇప్పుడు అంతటా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ బన్నీపై రేవంత్ నిన్న అసెంబ్లీలో <<14942545>>ఫైర్<<>> అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు ప్రకటించారు. రా.8 గంటలకు మీడియా ముందుకొచ్చి CM వ్యాఖ్యలు <<14946087>>సరికాదన్నారు<<>>. దీంతో INC, బన్నీ ఫ్యాన్స్ వారి వీడియోలు SMలో షేర్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
News December 22, 2024
మెగాస్టార్ తర్వాతి సినిమా తమిళ డైరెక్టర్‌తో?
మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్‌తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.