News December 21, 2024

విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్‌లో  తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News July 4, 2025

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

image

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.

News July 4, 2025

విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.

News July 4, 2025

విశాఖలో 50 అంతస్తుల అపార్ట్మెంట్లు.. డిజైన్లు ఇవే

image

విశాఖలో మధురవాడ పరిసర ప్రాంతాల్లో 50 అంతస్తుల 3BHK, 4 BHK ఫ్లాట్స్, 4BHK డూప్లెక్స్ ఫ్లాట్స్‌ని V.M.R.D.A నిర్మించనుంది. సర్వే నంబర్ 331/1 లోని 4.07 ఎకరాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. 6 టవర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తదితర అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. జాయింట్, PPP పద్ధతిలో ఈ ప్రాజెక్టు చేపడతారు. విశాఖలో ఇప్పటివరకు 50 అంతస్తులు అపార్ట్మెంట్లు లేవు.