News December 21, 2024
సీఎం సోదరుడి వల్ల వ్యక్తి చనిపోతే ఎందుకు చర్యల్లేవు?: హరీశ్
TG: అబద్ధాల్లో CM రేవంత్ రెడ్డి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై క్లారిటీ ఇవ్వలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధాకరమని హరీశ్ అన్నారు. కానీ సీఎం సోదరుడి వల్ల ఓ వ్యక్తి చనిపోతే చర్యల్లేవని, వాంకిడి హాస్టల్‌లో విషాహారం తిని బాలిక చనిపోతే మంత్రులెవరూ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
Similar News
News December 22, 2024
U-19 ఆసియా కప్ విజేత భారత్
అండర్-19 మహిళల ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 రన్స్ చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన బంగ్లాను 76 రన్స్‌కే ఆలౌట్ చేసి ఛాంపియన్‌గా అవతరించింది.
News December 22, 2024
అకౌంట్లలోకి డబ్బులు.. వీరికి రానట్లే!
TG: సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతుభరోసా డబ్బు జమ చేస్తామని మంత్రి తుమ్మల నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ నిబంధనలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రజాప్రతినిధులు, IT చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, CAలు, ఆర్కిటెక్టులు అనర్హులని చెప్పారు. దీంతో PMKY నిబంధనలే రైతుభరోసాకూ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News December 22, 2024
మాస్ మైగ్రేషన్ తప్పదు!: నారాయణమూర్తి
వాతావరణ మార్పుల వల్ల 20-25 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని Infosys నారాయణ మూర్తి హెచ్చరించారు. ఈ పరిస్థితులు ఇప్పటికే అధిక జనసాంద్రత కలిగిన B’lore, Pune, HYD నగరాల వైపు ప్రజల మాస్ మైగ్రేషన్‌కు దారితీయవచ్చన్నారు. ఇది ఈ నగరాల్లోని మౌలిక వనరులపై ఒత్తిడి పెంచుతుందని, అందువల్ల నేతలు, అధికారులు, కార్పొరేట్ లీడర్లు మేల్కోవాలన్నారు.