News December 21, 2024
APPLY NOW: 723 ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్-సికింద్రాబాద్ 723 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు రేపే(DEC-22) లాస్ట్ డేట్. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. మెటీరియల్ అసిస్టెంట్ & సివిల్ మోటార్ డ్రైవ్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య, ఇతర పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్‌సైట్: <
Similar News
News November 10, 2025
భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.
News November 10, 2025
ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.
News November 10, 2025
ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <


