News December 21, 2024
HYD మెట్రో ఫేజ్ 2పై కీలక అప్‌డేట్
హైదరాబాద్ మెట్రో రైల్ భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. ఫేజ్-2, కారిడార్ VI- MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు 800 ఆస్తుల భూసేకరణ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. చదరపు గజానికి రూ.81,000 చొప్పున నష్టపరిహారం కట్టించేందుకు సిద్ధం అయ్యింది. సమ్మతించిన ఇంటి యజమానులకు పది రోజుల్లో నష్టపరిహారాన్ని అధికారులు ఇవ్వనున్నారు.
Similar News
News January 3, 2025
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా CM: చామల
రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిశారన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యారని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చి రైతులను బీఆర్ఎస్ మోసం చేసేందుకు ప్లాన్ చేసిందని చామల ఆరోపించారు.
News January 2, 2025
హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్
హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం తలపెట్టిన బీసీ సభకు అనుమతి ఇవ్వాలని గురువారం ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా సభ తలపెట్టామని అన్నారు. కాగా, ఇప్పటికే సభ సన్నాహాలపై కవిత బీసీ సంఘాలతో విస్తృతంగా సమావేశాలు జరిపారు. మహాసభ పోస్టర్ సైతం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె.. సభ గురించి మీడియాతో మాట్లాడారు.
News January 2, 2025
ALERT.. HYD: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే HYDలో కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండడంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆసిఫ్‌నగర్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దంపతులు బైకుపై వెళ్తుండగా మాంజాతో గాయాలపాలయ్యారు.