News December 21, 2024

వాయుగుండం.. రేపు, ఎల్లుండి వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు-ఈశాన్య దిశగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 430కి.మీ, చెన్నైకి 490కి.మీ, గోపాల్‌పూర్(ఒడిశా)నకు 580కి.మీ దూరంలో ఉందని పేర్కొంది. ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News December 22, 2024

అకౌంట్లలోకి డబ్బులు.. వీరికి రానట్లే!

image

TG: సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతుభరోసా డబ్బు జమ చేస్తామని మంత్రి తుమ్మల నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ నిబంధనలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రజాప్రతినిధులు, IT చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, CAలు, ఆర్కిటెక్టులు అనర్హులని చెప్పారు. దీంతో PMKY నిబంధనలే రైతుభరోసాకూ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News December 22, 2024

మాస్ మైగ్రేష‌న్ త‌ప్ప‌దు!: నారాయ‌ణ‌మూర్తి

image

వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల 20-25 ఏళ్ల‌లో గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించలేని ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని Infosys నారాయ‌ణ మూర్తి హెచ్చరించారు. ఈ ప‌రిస్థితులు ఇప్పటికే అధిక జ‌న‌సాంద్ర‌త క‌లిగిన B’lore, Pune, HYD న‌గ‌రాల వైపు ప్ర‌జ‌ల‌ మాస్ మైగ్రేష‌న్‌కు దారితీయ‌వ‌చ్చ‌న్నారు. ఇది ఈ న‌గరాల్లోని మౌలిక వనరులపై ఒత్తిడి పెంచుతుంద‌ని, అందువల్ల నేత‌లు, అధికారులు, కార్పొరేట్ లీడ‌ర్లు మేల్కోవాల‌న్నారు.

News December 22, 2024

క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీం షాక్

image

క్రెడిట్ కార్డుల బకాయిలపై బ్యాంకులు భారీ వడ్డీలు విధిస్తుంటాయి. ఏకంగా 35 శాతం నుంచి 50శాతం వరకూ వడ్డీలు విధించడాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ గతంలో తప్పుబట్టింది. వడ్డీ 30శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. దానిపై బ్యాంకులు సుప్రీంను ఆశ్రయించగా విచారణ అనంతరం వాటికి అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది. 30శాతానికిపైగా వడ్డీని విధించుకోవచ్చని పేర్కొంది.