News December 21, 2024
అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ఆలస్యం.. కొనసాగుతున్న ఉత్కంఠ
అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. రా.7 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని ప్రెస్‌కు సమాచారం ఇవ్వడంతో అంతా ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్నారు. కానీ రా.8 గంటలు కావొస్తున్నా అర్జున్ ఇంకా బయటికి రాకపోవడంతో మీడియా ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు కూడా బన్నీ ప్రెస్‌మీట్ ఎప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 22, 2024
అకౌంట్లలోకి డబ్బులు.. వీరికి రానట్లే!
TG: సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతుభరోసా డబ్బు జమ చేస్తామని మంత్రి తుమ్మల నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న PM కిసాన్ నిబంధనలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రజాప్రతినిధులు, IT చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, CAలు, ఆర్కిటెక్టులు అనర్హులని చెప్పారు. దీంతో PMKY నిబంధనలే రైతుభరోసాకూ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News December 22, 2024
మాస్ మైగ్రేషన్ తప్పదు!: నారాయణమూర్తి
వాతావరణ మార్పుల వల్ల 20-25 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని Infosys నారాయణ మూర్తి హెచ్చరించారు. ఈ పరిస్థితులు ఇప్పటికే అధిక జనసాంద్రత కలిగిన B’lore, Pune, HYD నగరాల వైపు ప్రజల మాస్ మైగ్రేషన్‌కు దారితీయవచ్చన్నారు. ఇది ఈ నగరాల్లోని మౌలిక వనరులపై ఒత్తిడి పెంచుతుందని, అందువల్ల నేతలు, అధికారులు, కార్పొరేట్ లీడర్లు మేల్కోవాలన్నారు.
News December 22, 2024
క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీం షాక్
క్రెడిట్ కార్డుల బకాయిలపై బ్యాంకులు భారీ వడ్డీలు విధిస్తుంటాయి. ఏకంగా 35 శాతం నుంచి 50శాతం వరకూ వడ్డీలు విధించడాన్ని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ గతంలో తప్పుబట్టింది. వడ్డీ 30శాతానికి మించకూడదని తేల్చిచెప్పింది. దానిపై బ్యాంకులు సుప్రీంను ఆశ్రయించగా విచారణ అనంతరం వాటికి అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది. 30శాతానికిపైగా వడ్డీని విధించుకోవచ్చని పేర్కొంది.