News December 21, 2024

నేను రోడ్ షో చేయలేదు: అల్లు అర్జున్

image

‘పుష్ప2’ ప్రీమియర్‌కు సంధ్య థియేటర్ వద్ద తాను రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. తన కోసం ఎదురుచూస్తున్న వేలాది ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు. అనంతరం కాసేపు సినిమా చూసి వెళ్లిన తనకు తొక్కిసలాటపై మరుసటి రోజే తెలిసిందన్నారు. రేవతి మృతి గురించి తెలిసి ఆస్పత్రికి బయల్దేరినా, కేసు నమోదవడంతో వెళ్లొద్దని పోలీసులు, సన్నిహితులు చెప్పారని అల్లు అర్జున్ వెల్లడించారు.

Similar News

News December 22, 2024

ఘోర ప్రమాదం.. 38 మంది మృతి

image

ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News December 22, 2024

దేశీయ చాయ్‌కి అమెరికా ‘ఆరోగ్య’ గుర్తింపు

image

భార‌తీయులు అమితంగా ఇష్ట‌ప‌డే చాయ్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశీయ తేయాకుగా ప్రసిద్ధి చెందిన కమెల్లియా సైనెన్సిస్‌తో త‌యారు చేసిన టీని ఆరోగ్య‌క‌ర‌మైన పానీయంగా US Food and Drug Administration గుర్తించింది. ఈ నిర్ణయాన్ని నార్త్ ఈస్టర్న్ టీ, ఇండియన్ టీ అసోసియేషన్లు స్వాగతించాయి. అంత‌ర్జాతీయ టీ ప‌రిశ్ర‌మ‌కు ఇదో అద్భుత‌మైన వార్త అని అమెరికా టీ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ ఎఫ్ గోగ్గి పేర్కొన్నారు.

News December 22, 2024

రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి UPలోని ఓ కోర్టు నోటీసులిచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ కులగణనపై మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 7న విచారణకు హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది.