News December 21, 2024
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: సీఎం
TG: ప్రతి పేదవాడికి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని CM రేవంత్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ‘పేదలకు విద్య, వైద్యాన్ని క్రైస్తవ మిషనరీలు అందిస్తున్నాయి. ఇంకో మతాన్ని కించపరచకుండా ఎవరైనా మతప్రచారం చేసుకోవచ్చు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
Similar News
News December 22, 2024
అందుకే వైభవ్‌ను కొనుగోలు చేశాం: సంజూ శాంసన్
13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని IPL వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం వెనుక కారణాన్ని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆస్ట్రేలియా-భారత్ అండర్-19 టెస్టు మ్యాచ్‌ను మా మేనేజ్‌మెంట్ ప్రత్యక్షంగా చూసింది. చాలా తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా మాకు ఉండాలని భావించాం. జైస్వాల్, పరాగ్, జురెల్ వంటి ఆటగాళ్లనూ ఇలాగే గుర్తించాం’ అని తెలిపారు.
News December 22, 2024
అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై మంత్రి కామెంట్స్
TG: ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్‌కు వచ్చారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి స్పష్టం చేశారు.
News December 22, 2024
పేర్ని నానికి పోలీసుల నోటీసులు
AP: మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిన కేసులో విచారణకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా హాజరు కావాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం.