News December 21, 2024

మహారాష్ట్ర నూతన మంత్రివర్గం ఖరారు

image

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. హోం, విద్యుత్, న్యాయ శాఖ పదవులు తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక, ప్లానింగ్ శాఖను అజిత్ పవార్‌కు, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలను ఏక్‌నాథ్ శిండేకు అప్పగించారు. రెవెన్యూ-చంద్రశేఖర్ ప్రభావతి, వ్యవసాయ-మాణిక్‌రావు సరస్వతి, సివిల్ సప్లై-ధంజయ్ రుక్మిణి ముండే, పరిశ్రమలు-ఉదయ్ స్వరూప రవిచంద్ర, ఐటీ-ఆశిశ్ మీనాల్.

Similar News

News January 20, 2026

ఏ బాటిల్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు?

image

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.

News January 20, 2026

మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

image

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.

News January 20, 2026

మాఘ మాసంలో పెళ్లి చేసుకుంటున్నారా?

image

మాఘ మాసంలో పెళ్లి చేసుకోవడం ఓ సంప్రదాయమే కాదు. అది దంపతుల జీవితంలో ఓ శుభారంభం కూడా! ఆధ్యాత్మికంగా ఈ మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండటం వల్ల, ఈ సమయంలో జరిగే వివాహ బంధానికి దైవబలం మెండుగా లభిస్తుందని నమ్ముతారు. జ్యోతిషం ప్రకారం.. మాఘంలో కుజ, గురు గ్రహాల అనుకూలత వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరిగి, వంశాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి అతిథుల రాకకు సౌకర్యంగా ఉంటుంది.