News December 22, 2024

యువత జాతీయ స్థాయిలో రాణించాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిర్వహించే జిల్లా యువ ఉత్సవాల్లో యువత తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

Similar News

News January 3, 2025

గౌరీపట్నం: భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి

image

దేవరపల్లి మండలం గౌరిపట్నం తాలూకా కొండగూడెం 15వ వీధిలో రాపాక నాగార్జున(38) భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా భార్య మీద అనుమానం, పలుమార్లు ఫోన్ వాడొద్దని చెప్పిన మాట వినకపోవడంతో తీవ్ర అసహనానికి గురై భార్యపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు స్పందించి ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి పోలీసులు సీఐ, ఎస్సైలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

News January 3, 2025

ఏలూరు: సదరం పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి

image

సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.కన్నబాబు, సెర్ఫ్ సిఇవో వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.

News January 2, 2025

ఏలూరు: కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు 346 మందికి 211 మంది ఎంపిక

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్‌లో మూడోరోజు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గురువారం ప్రారంభించారు. 346 మంది అభ్యర్థులు హాజరు కాగా 211 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. 3, 4వ తేదీలలో మహిళా కానిస్టేబుల్స్‌కు మహిళ అధికారులతో ప్రత్యేక పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచీలకు అనుమతి లేదన్నారు.