News December 22, 2024

జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం

image

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.

Similar News

News January 18, 2026

రెవెన్యూ క్లినిక్‌లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News January 18, 2026

సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

image

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.

News January 17, 2026

ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

image

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.