News December 22, 2024
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి

AP: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. మధుమూర్తి ప్రస్తుతం వరంగల్ నీట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు(D) జాగర్లమూడికి చెందిన ఈయన విశాఖలో విద్యనభ్యసించారు. వైసీపీ హయాంలో విద్యామండలి ఛైర్మన్‌గా పనిచేసిన హేమచంద్రారెడ్డి జూన్‌లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Similar News
News September 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 22, 2025
అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది.
News September 22, 2025
బిగ్ బాస్: ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ హౌస్ సీజన్-9 రెండో వీక్‌లో కామన్ మ్యాన్ మనీశ్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉండగా తక్కువ ఓట్లు వచ్చిన మనీశ్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. టాప్-4లో భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన, హరిత హరీశ్‌లు ఉంటారని మనీశ్ అభిప్రాయపడ్డారు. తొలి వారం కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.