News December 22, 2024
FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు
TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Similar News
News December 22, 2024
ప్రజలపై ‘చంద్ర’బాదుడు: వైసీపీ నేతలు
AP: అధికారంలోకి వచ్చిన తర్వాత CM చంద్రబాబు హామీలను గాలికొదిలేశారని YCP నేతలు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ నెల 27న YCP పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోయలేక ప్రజలు అల్లాడుతున్నారు. SC, STలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పలికారు. ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం’ అని వారు మండిపడ్డారు.
News December 22, 2024
ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు: బన్నీ వార్నింగ్
తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని కోరారు. కాగా, బన్నీ అరెస్టు తర్వాత సీఎంపై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.
News December 22, 2024
భద్రతను కుదించుకున్న చంద్రబాబు
AP: CM చంద్రబాబు తన భద్రతను కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని CM నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్‌తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.